Two Directors to direct a Telugu Film to be shot in USA

ఒకే చిత్రానికి ఇద్దరు దర్శకులు!!

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ లో “మల్లె పువ్వు”, “మెంటల్ కృష్ణ”, నంది అవార్డు పొందిన “కలవరమాయే మదిలో” వంటి మంచి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల కొన్నాళ్లుగా నిర్మాతల మండలి మరియు ఫిలిం ఛాంబర్ లో కొన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తూ నిర్మాణ రంగానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు. అయితే మోహన్ వడ్లపట్ల ప్రస్తుతం ఒక భారీ చిత్రాన్ని పూర్తిగా అమెరికా లో ప్రాధాన్యత కలిగిన అనేక ప్రాంతాల్లో నిర్మించడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల త్వరలో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టబోతున్నారు.

ఈ చిత్రం లో ఒక ప్రముఖ ఎన్నారై అమ్మాయి జో శర్మ (కాలిఫోర్నియా లోని శాన్ ఫ్రాన్సిస్కో)ని తెలుగు తెరకి పరిచయం కాబోతున్నారు. ఈ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ సంగీతమందిస్తున్నారు. భారీ ఎక్విప్మెంట్ తో K.తిరుపతి రెడ్డి (K T R) ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చెయ్యనున్నారు. ఇంకా ఈ చిత్రానికి హీరో ఎంపిక జరగాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి హీరో గా టాలీవుడ్ లోని ప్రముఖ యువ హీరోతో చర్చలు జరుపుతున్నారు. వడ్లపట్ల-బోడపాటి ఇద్దరు కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబందించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మోహన్ వడ్లపట్ల తెలిపారు.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.