Vinayakarao Happy To Do Mukhtar Khan Role In Bharat Ane Nenu

సంతృప్తినిచ్చిన పాత్ర చేశా
– ముక్తార్‌ ఖాన్‌

"కెరీర్‌ బిగినింంగ్‌ నుంచీ ఎక్కువ శాతంం పోలీస్‌ పాత్రలతోపాటు, అక్కడక్కడ ప్రతినాయక ఛాయలున్న పాత్రలూ చేశా. ఫర్‌ ఎ ఛేంజ్‌ ’’భరత్‌ అనే నేను" లో కొత్తతరహా పాత్రలో కనిపించా" అని ముక్తార్‌ఖాన్‌ తెలిపారు. 1991 చిరంంజీవి నటించిన ’’రౌడీ అల్లుడు" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన తమిళం, కన్నడ, హిందీ, భోజపురి భాషల్లో ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. బుల్లితెరపై’’ మొగలిరేకులు " సీరియల్ లో సికిందర్‌గా ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ ’’సింహ లో కమిషనర్‌ పాత్ర చేసినప్పటి నుంచీ నా ఫిజిక్‌ పోలీస్‌ పాత్రలకు పర్ఫెక్ట్‌గా సూట్‌ అవుతుంందని దర్శకులు ఎక్కువగా ఆ పాత్రలే ఇస్తున్నారు. ’’విశ్వరూపం" కాటమరాయుడు , పైసా వసూల్‌, ’’లయన్ , టెంపర్ చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా నటింంచిన ’’భరత్‌ అనే నేను" ఫుల్‌ లెంగ్త్‌ మహేశ్‌గారి పక్కన నటించడంం కొత్త అనుభూతి కలిగించింది. ఆయనతో కలిసి సినిమా చెయ్యడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో పోషించిన ముక్తార్‌ పాత్ర నటుడిగా నన్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. నాకు కొత్త తరహా పాత్ర ఇది. ఈ మధ్యకాలంంలో చాలా సినిమాల్లో చేసినప్పటికీ ఈ చిత్రం నాకు చక్కని సంతప్తిని కలిగించింది. ఇకపై నెగటివ్ పాత్రలతోపాటు తండ్రి పాత్రలు కూడా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా. బాలీ వుడ్‌లో నటింంచిన 'హలో బ్రదర్, ’’హల్‌చల్‌' చిత్రాలు కూడా చక్కని గుర్తింంపు తీసుకొచ్చాయి" అని తెలిపారు.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.