South Cinema

Mehbooba trailer to be screened in more than 1700 screens

1700కి పైగా  స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌ 

Mehbooba trailer to be screened in more than 1700 screens

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రానికి సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంతోపాటు ప్రదర్శించనున్నారు. 1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు.

 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Facebook Comments

About uma

Share