South Cinema

Watching movie with audience gives a new high: Inthalo Ennenni Vinthalo movie team

ప‌బ్లిక్ మ‌ధ్య‌లో కూర్చోని సినిమా చూడ‌టం చాలా హ్యాపీగా ఉంది-` ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో` చిత్ర యూనిట్‌!!

Watching movie with audience gives a new high: Inthalo Ennenni Vinthalo movie team

హ‌రి హ‌ర చ‌ల‌న చిత్ర ప‌తాకంపై  నందు, సౌమ్య  వేణుగోపాల్, పూజారామ‌చంద్ర‌న్ , గ‌గ‌న్ విహారీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో. వ‌ర‌ప్ర‌సాద్ వ‌రికూటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహ‌న్ రావు ఇప్పిలి నిర్మించారు. ఈ చిత్రం ఈ రో జు విడుద‌లైంది.   చిత్ర యూనిట్  ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ మ‌యూరి థియేట‌ర్ లో ప‌బ్లిక్ తో క‌లిసి సినిమాను తిల‌కించారు.

 

ఈ సంద‌ర్భంగా యూనిట్ స‌భ్యులు మీడియాతో మాట్లాడుతూ...శ్రీ మ‌యూరి థియేట‌ర‌ల్ లో ప‌బ్లిక్ తో క‌లిసి  మా సినిమా  `ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో ` చిత్రాన్ని చూడ‌టం చాలా ఆనందంగా ఉంది.  ప్ర‌తి సీన్ ని ప‌బ్లిక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీకి , హీరో చెప్పే ఎమోష‌న‌ల్ డైలాగ్స్ కి, గ‌గ‌న్ విహారీ విల‌నిజానికి  ఆడియ‌న్స్ క్లాప్స్ , విజిల్స్ కొడుతున్నారు. మేము సిన్సియ‌ర్ గా  చేసిన ఎఫ‌ర్ట్ కి త‌గ్గ రెస్పాన్స్ రావ‌డంతో చాలా ఆనందంగా ఉన్నాం. ఆడియ‌న్స్ తో క‌లిసి  సినిమా చూడ‌టం వండ్ర‌ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్ . మా సినిమా విడుదలైన అన్ని సెంట‌ర్స్ నుంచి మంచి రెస్ప‌సాన్స్ వ‌స్తోంది.  మా చిత్రానికి  ఇంత మంచి స‌క్సెస్ ను అందించిన ప్రేక్ష‌క మ‌హాశ‌యుల‌కు ధ‌న్యావాదాలు అన్నారు.

Facebook Comments

About uma

Share