Miss Ability 2018 Figure Out Beauty contest held in Hyderabad

'మిస్ ఎబిలిటీ 2018 ఫిగర్ ఔట్ బ్యూటీ కాంటెస్ట్' లో సత్తా చాటిన దివ్యాంగులు

అంగవైకల్యం అనేది కోట్ల తెలుగు పదాలలో ఒక పదం. ఆ పదమే కొన్ని కోట్ల జీవితాలని ప్రశ్నర్థకంగా మారుస్తుంది. మనుషుల్ని సృష్టించిన దేవుడు.. అందరికి అన్ని ఇచ్చి, కొందరికి మాత్రం కొన్ని ఇవ్వడం మర్చిపోతున్నాడు. దేవుడు మరిచిపోతే పరవాలేదు కానీ, వారిని సాటి మనిషి కూడా మరచిపోతే అదే సమస్య. శరీరభాగం లేకపోతే సమాజంలో భాగం కాలేమా? సహాయం అవసరం అయినంత మాత్రాన నిస్సహాయంగా మిగిలిపోవాల్సిందేనా? అందుకే ఈ ఈ దివ్యాంగులని ఎన్నో కళ్ళు చూసే జాలి చూపుల మధ్యలోంచి ఉజ్వల  రేపటి వైపు దారి చూపడానికి చేస్తున్న మహా యజ్ఞమే మిస్ ఎబిలిటీ కాంటెస్ట్.

తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రముఖ నిర్మాత ప్రశాంత్ గౌడ్, వసుంధర, లతా చౌదరి ఆధ్వర్యంలో 'మిస్ ఎబిలిటీ 2018 ఫిగర్ ఔట్ బ్యూటీ కాంటెస్ట్' ను వీవ్ మీడియా సంస్థ నిర్వహించింది. ఆదివారం మాదాపూర్ లోని శిల్పకళావేదిక పై జరిగిన ఫైనల్స్ లో కాంటెస్ట్ విన్నర్స్ కి బహుమతి ప్రధానం మంత్రి నాయిని నరసింహారెడ్డి సమక్షములో జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత రాజ్ కందుకూరి, హీరోయిన్ విమలారామన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.