Kaluva Ugadi Telugu Calendar Launched

కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం న్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యంతో సాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామరాజు, నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు వీరశంకర్, సినీ విమర్శకుడు కత్తి మహేష్, సినీ నటి పూనమ్ కౌర్ తదితరులు హాజరయ్యారు. న్యూస్ హెరాల్డ్ చైర్మన్ మురహరి మహరాజ్, ఎడిటర్ రాంబాబు నాయుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు
రఘురామరాజు, రాజ్ కందుకూరి, వీరశంకర్, కత్తి మహేష్ చేతుల మీదుగా న్యూస్ హెరాల్డ్ సీఈవో అనిల్ క్యాలెండర్‌రను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. తెలుగు భాష విశిష్టతను, ప్రాధాన్యతను పలువురు ప్రముఖులు వివరించారు.

పలు రంగాల్లో ప్రతిభ చూపిన కొందరికి కలువ అవార్డులతో సన్మానించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమం తెలుగుదనం, కట్టుబొట్టుతో వేడుక అద్యంతం ఆకట్టుకుంది

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%