South Cinema

First Single from Vishal’s Abhimanyudu to be released on March 8th

మార్చి 8న మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' మొదటి పాట విడుదల 

First Single from Vishal's Abhimanyudu to be released on March 8thమాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నారు. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. కాగా, ఈ చిత్రంలోని తొలి పాటను యూత్‌ స్టార్‌ నితిన్‌ చేతులమీదుగా మార్చి 8న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మార్చి 8న ఈ చిత్రంలోని మొదటి పాటను హీరో నితిన్‌ విడుదల చేయనున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు'' అన్నారు.
మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

 

Facebook Comments

About uma

Share