Shocked hearing Sridevi died: K.L Narayana

శ్రీదేవిగారి మ‌ర‌ణ వార్త విని షాక‌య్యా:  `క్ష‌ణ క్ష‌ణం` నిర్మాత కె.ఎల్ .నారాయ‌ణ‌

Shocked hearing Sridevi died: K.L Narayana

క్ష‌ణ క్ష‌ణం ( శ్రీ దుర్గా ఆర్స్ట్ బ్యాన‌ర్) చిత్ర నిర్మాత‌లు కె.ఎల్ నారాయ‌ణ‌, ఎస్ గోపాల్ రెడ్డి  అతిలోక సుంద‌రి శ్రీదేవి మృతిపట్ల  ఆమె కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

 

శ్రీదేవి గారికి నేను  పెద్ద అభిమానిని...మా బ్యాన‌ర్లో తెర‌కెక్కిన మొద‌టి సినిమాక్ష‌ణ క్ష‌ణం` లో  శ్రీదేవి గారు హీరోయిన్ గా న‌టించ‌డం ఎంతో గొప్ప విషయమని కె.ఎల్ నారాయ‌ణ తెలిపారు. ఆ సినిమాలో  శ్రీదేవి న‌ట‌న‌కు గాను  నంది, ఫిలిం ఫేర్ అవార్డుల‌ను కూడా అందుకున్నార‌న్నారు. దీంతో మా బ్యాన‌ర్ పేరు ప్ర‌ఖ్యాతలు పెరిగాయి. త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించి ఉన్న‌త శిఖ‌రాలకు చేరుకున్నార‌న్నారు.  అలాంటి గొప్ప న‌టి ఈరోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం బాధాక‌రమ‌ని...ఆమె కుటుంబానానికి  ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Facebook Comments

About uma

Share