South Cinema

Happy Birthday to Vi Anand

హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ వి.ఐ. ఆనంద్

Happy Birthday to Vi Anand

విభిన్న‌మైన సినిమాల‌తో ఆయ‌న ప్ర‌యాణం.. కొత్త క‌థ‌లే ఆయ‌న ప్ర‌య‌త్నం.. చేసింది త‌క్కువ సినిమాలే కానీ వాటితోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్. చేసే ప్ర‌తీ సినిమాలోనూ.. రాసే ప్ర‌తీ క‌థ‌లోనూ కొత్త‌దనాన్ని కోరుకునే ద‌ర్శ‌కుడు ఈయ‌న‌. టైగ‌ర్ లో కాశీ ప‌రువు హ‌త్య‌లు లాంటి సంచ‌ల‌న విష‌యాన్ని చూపించాడు.

 

ఇక ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాలో ఆత్మ‌ల‌తో మ‌నుషుల ప్రేమ‌ను హైలైట్ చేసాడు. ఒక్క‌క్ష‌ణంలో ప్యార‌ల‌ల్ లైఫ్ అంటూ మ‌న‌కి తెలియ‌ని ఓ ప్ర‌పంచాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు ఓ అగ్ర నిర్మాణ సంస్థ‌లో అగ్ర హీరోతో త్వ‌ర‌లోనే సినిమా చేయ‌బోతున్నాడు విఐ ఆనంద్. కొత్త‌దనానికి ఎప్పుడూ పెద్ద‌పీట వేసే వినూత్న ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు. ఈయ‌న ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని.. ఇలాంటి ఇంకెన్నో మంచి సినిమాలు ఆయ‌న నుంచి రావాల‌ని కోరుకుందాం..!

Facebook Comments

About uma

Share