‘Prema Pavuralu’ is a feel good love story

ఫీలుగుడ్  లవ్ స్టోరీ "ప్రేమ పావురాలు"

నయనతార ప్రధాన పాత్రలొ వాసుకీ లాంటి సంచలన సినిమాను అందించిన శ్రీరామ్ సినిమా బ్యానర్ లో వస్తొన్న రెండో చిత్రం  "ప్రేమ పావురాలు". గతేడాది తమిళ్ లో "కాదల్ కన్ కట్టుదే " పేరుతొ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇప్పుడు తెలుగులొనూ విడుదలకు సిద్దమవుతోంది.

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా విడుదలై  2017 లొ దిబెస్ట్ లవ్ స్టొరీగా తమిళ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న చిత్రం "కాదల్ కన్ కట్టుదే ". ప్రధాన‌పాత్రల్లొ నటించిన కెజి, అతుల్య లు ఈ సినిమా తో ఓవర్ నైట్ స్టార్స్ గా ఎదిగారు. తెలుగులో ఈ చిత్రాన్ని నేరుగా రీమెక్ చెయాలనుకున్నా, ఓరిజినల్ వెర్షెనంత ప్రెష్ గా నెచురల్ గా సినిమా ఔట్ పుట్ రాదని భావించి , డబ్ చెస్తున్నాము. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు శివరాజ్ .ఆర్ అందించిన కధ, కథనాలతో పాటు లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయి.పవన్ సంగీతం , ఆర్.ఆర్. మరో ఎసెట్ గా చెప్పుకొవచ్చు.

స్ట్రైయిట్ తెలుగు సినిమా తరహా లొనె క్వాలిటీ గా  డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. సమ్మర్ లో సినిమాను విడుదల చెస్తామన్నారు

Facebook Comments

About uma

Share

This website uses cookies.