Naa Peru Surya Naa Illu India Second Song ‘Lover Also Fighter Also’ releasing on Feb 14th as Valentines Day gift

వాలెంటైన్స్ డే కానుకగా "నా పేరు సూర్య "చిత్రంలోని "లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో"... సాంగ్ రిలీజ్

ప్రేమికుల దినోత్సవం అందరికీ ప్రత్యేకమే. అందుకే వాలెంటైన్స్ డే కానుకలు అంత ప్రత్యేకం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన అభిమానుల కోసం ప్రేమికుల దినోత్సవ కానుక ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా... ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. ఈ పాటను అల్లు అర్జున్, హీరోయిన్ అనూ ఎమ్మాన్యూయేల్ పై అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. మొదటి పాటగా రిలీజ్ చేసిన సైనిక పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.... రెండో పాటగా రిలీజ్ కానున్న లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాట కూడా అంతే ఆదరణ పొందుతుంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈచిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సారి ప్రేమికుల దినోత్సవం అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేకంగా ఉండనుంది. ఈ చిత్రంలోని లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికులకు కానుకగా అందించబోతున్నాం. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ అద్భుతమైన పాటను రిలీజ్ చేస్తున్నాం. రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు. విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)

ఫైట్స్ - రామ్ లక్ష్మణ్

సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్

సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి

సంగీతం - విశాల్ - శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు

బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

సమర్పణ - k.నాగబాబు

సహ నిర్మాత - బన్నీ వాసు

నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి

రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%