South Cinema

Proud to be the student of Lakshmi Devi Kanakala: Chiranjeevi

ల‌క్ష్మీదేవిగారి శిష్యుడినైనందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను:  మెగాస్టార్ చిరంజీవి

Proud to be the student of Lakshmi Devi Kanakala: Chiranjeeviపేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం నటనలో  ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. వారు దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో  ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా  ప్ర‌గాఢ  సానుభూతి  తెలిజ‌య‌జేస్తున్నాని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

కాగా మెగాస్టార్  చిరంజీవి  హైద‌రాబాద్  సిటీ లో  లేని కార‌ణంగా దేవ‌రాజు-ల‌క్ష్మీదేవి కుమారుడు రాజీవ్ క‌న‌కాల‌ను  మెగాస్టార్ ఫోన్  కాల్ ద్వారా ప‌రామ‌ర్శించారు.

 

Facebook Comments

About uma

Share