Rajaratham to release on February 16th

ఫిబ్రవరి 16న 'రాజరథం'

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రాజరథం'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు, సంగీత దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ ''రంగితరంగ' వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'రాజరథం'. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సంగీతం కూడా సమకూర్చాను. ఇందులో మొత్తం ఏడు పాటలు వున్నాయి. ఈ పాటలకు రామజోగయ్యశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలకు తప్పనిసరిగా లైవ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌నే వాడాల్సి వుండంతో వాటితోనే పాటల్ని రికార్డ్‌ చెయ్యడం జరిగింది.

చెన్నైలో విజిపి రికార్డింగ్‌ థియేటర్‌ చాలా ఫేమస్‌. పాటలకు దేవి ఆర్కెస్ట్రా ఎరేంజ్‌ చేశారు. స్యాక్స్‌ రాజా చాలా సీనియర్‌ మ్యూజిషియన్‌. ఆయన పాటలకు ఎరేంజ్‌మెంట్స్‌ చేశారు. రిథమ్స్‌ని ఇండియాలోనే బిగ్గెస్ట్‌ స్టూడియో అయిన యశ్‌రాజ్‌ స్టూడియోలో చేశాం. దీపేశ్‌వర్మ రెండు పాటలకు రిథమ్స్‌ ప్లే చేశారు. దాదాపు 60 మంది మ్యూజిషియన్స్‌తో పాటల్ని క్వాలిటీగా రికార్డ్‌ చేశాం. ఆడియోపరంగా, విజువల్‌గా పాటలు అందరికీ నచ్చుతాయి'' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన అజయ్‌రెడ్డి గొల్లపల్లి మాట్లాడుతూ ''రంగితరంగ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన టీమ్‌ తెలుగులో 'రాజరథం' చిత్రంతో పరిచయమవుతోంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అనూప్‌ భండారి ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో, బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌తో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 16న 'రాజరథం' చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం'' అన్నారు.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాజరథం' చిత్రంలో నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి, పి.రవిశంకర్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటింగ్‌: శాంతకుమార్‌, సినిమాటోగ్రఫీ: విలియమ్‌ డేవిడ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ సాజ, నిర్మాణం: జాలీహిట్స్‌ టీమ్‌, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్‌ భండారి.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%