Sripathy Karri directional Hulchul Movie First Look released

శ్రీపతి కర్రి దర్శకత్వంలో వస్తున్న "హల్ చల్" ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రద్రాక్ష్ ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. టైటిల్ ఎంత క్యాచీగా ఉందో ఆడియెన్స్ ను అదే స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తుందని దర్శకుడు శ్రీపతి కర్రి అంటున్నారు.

హల్ చల్ ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.... హల్ చల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్ అంశాలతో పాటు.. అన్ని రకాల కమర్షియల్ యాంగిల్స్ ని టచ్ చేశాం. అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా స్క్రిప్ట్ కుదిరింది. నా తొలి చిత్రమైనప్పటికీ నిర్మాత గణేష్ కొల్లూరి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ తో నేను అనుకున్న దానికంటే కూడా బాగా షూటింగ్ చేయగలుగుతున్నాం. రుద్రాక్ష ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ క్యారెక్టరైజేషన్స్ అబ్బురపరుస్తాయి. ఇద్దరూ జోష్ ఫుల్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే... నా మీద మరింత బాధ్యత పెరిగింది. ఆడియెన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా... ఎంటర్ టైన్ చేసే విధంగా సినిమా ఉంటుంది. అని అన్నారు.

నిర్మాత గణేష్ మాట్లాడుతూ... శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీపతి దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాం. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మంచి క్యాచీ టైటిల్ పెట్టారనే ప్రశంసలు దక్కాయి. దర్శకుడు శ్రీపతి చాలా క్లారిటీగా ఉన్నాడు. తప్పకుండా సూపర్ హిట్ ఫిల్మ్ మా బ్యానర్ నుంచి వస్తుందని ఆశిస్తున్నాం. రుద్రాక్ష్, ధన్యా పెర్ ఫార్మెన్స్ హైలెట్ గా ఉంటుంది. అటు ఆర్టిస్టులు... ఇటు టెక్నీషియన్స్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

Sri Raghavendra art creations
Cast:
Rudhraksh Utkam

Dhanya Balakrishna

Krishnudu

Madhu Nandhan

Gemini suresh

Shanmukh

Jogi naidu

Ravi Prakash

Priti Nigam

Banda Raghu

Crew:

Producer: Ganesh Kolluri

Written n directed by: sripathy karri

Dop: Raj thota

Editor: praveen pudi

Music: Hanuman and Bharath

Art Dir: R.K.Reddy

Publicity design: Anil and Bhanu

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.