” Saptagiri Is Having A Great Journey In Industry ” – Brilliant Director Sukumar At ‘Saptagiri LLB’s 4th Song Launch

With superhit 'Saptagiri Express', Saptagiri is currently having a very good craze as a Hero. His second film as a Hero, 'Saptagiri LLB' is produced by Popular Doctor, Tasteful Producer Dr K.Ravi Kirane under his Sai Celluloid Cinematic Creations Pvt Ltd. 'Saptagiri LLB' is based on bollywood superhit 'Jolly LLB'. Charan Lakkakula who has an immense experience in direction department is directing this film.Dialogue King Sai Kumar, Dr.Siva Prasad played important roles in this film. Recently released Teaser, Songs,Trailer have garnered superb response. Fourth song in this film is launched by Brilliant Director Sukumar. Hero Saptagiri, Director Charan Lakkakula, Music Director Bulganin, Producer Dr Ravi Kirane attended the event.

Brilliant Director Sukumar says, " I knew Saptagiri since he was working as an assistant director. 'Saptagiri Express' became a very good success. Now he is coming again as 'Saptagiri LLB'. I watched the songs and they are very good onscreen. I thought that songs might by composed by a big music director. But, new music director Bulganin composed fantastic songs .I was shocked to see Saptagiri's dances and fights. He seemed like a mixture of Rajinikanth garu and Chiranjeevi garu. He created a separate market for himself. He is having a great journey in this industry. Ramajogayya Sastry penned very good lyrics. I know Director Charan since longtime. We often meet with each other. He is a very talented director. Producer Ravi Kirane is a very good hearted person. I wish a very big success for this film. Entire team looks very confident about the film."

Music Director Bulganin says, " I am very happy that my favorite song in the album gets launched by Sukumar garu."

Director Charan Lakkakula says, " Me and Sukumar worked together for Editor Mohan garu. He became a great director. I am very happy that he liked and congratulated me after watching Songs and Trailer."

Hero Saptagiri says, " Sukumar garu is very unique and he is one of my favorite directors. I heartfully thank Sukumar garu for releasing fourth song crooned by Kailash Kher for our 'Saptagiri LLB."

Producer Dr Ravi Kirane says, " Ramajogayya Sastry penned the lyrics for this fourth song which is crooned by Kailash Kher. This is a background song in the film. I am happy that a sensible director like Sukumar garu launched this song. I thank him on the behalf of our entire team."

'Sapthagiri LLB' is slated to release worldwide on December 7th

Along with Comedy King Saptagiri, Kashish Vohra will be seen as female lead.

Dialogues : Paruchuri Brothers
Music : Vijay Bulganin
Co-Director : Rajasekhar Reddy Pulicherla
Photography : Saarangam S.R
Editing : Goutham Raju
Art : Arjun
Lyrics : Chandra Bose, Kandikonda
Production Executive : Bhikshapati Tummala
Producer : Dr. Ravi Kirane
Direction : Charaen Lakkakula

సప్తగిరి జర్నీ చాలా చాలా బాగుంది
- 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' నాలుగో పాట ఆవిష్కరణలో
బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తోన్న ద్వితీయ చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి'కి రీమేక్‌ ఇది. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్‌ నిర్మాత డా. రవికిరణ్‌ చరణ్‌ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, డా. శివప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బుల్గానిన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని నాలుగో పాటని బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఇటీవల రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, డైరెక్టర్‌ చరణ్‌ లక్కాకుల, సంగీత దర్శకుడు బుల్గానిన్‌, నిర్మాత డా. రవికిరణ్‌ పాల్గొన్నారు.

బ్రిలయంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ - ''సప్తగిరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి తెల్సు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' మంచి హిట్‌ అయ్యింది. మళ్లీ 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ఎవరో పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేసి వుంటాడు అనుకున్నా. కానీ కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ బుల్గానిన్‌ ఫెంటాస్టిక్‌ సాంగ్స్‌ చేశాడు. సప్తగిరి డ్యాన్స్‌లు, ఫైట్స్‌ చూసి షాక్‌ అయ్యా. రజనీకాంత్‌, చిరంజీవిగారు మిక్స్‌ అయితే ఎలా వుంటుందో సప్తగిరి అలా కన్పించాడు. తనకంటూ ఒక సెపరేట్‌ మార్కెట్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. అతని జర్నీ చాలా చాలా బాగుంది. రామజోగయ్య శాస్త్రి మంచి లిరిక్స్‌ రాశారు. డైరెక్టర్‌ చరణ్‌ ఎప్పట్నుంచో తెల్సు. అప్పుడప్పుడు కలుస్తుంటాం. చాలా టాలెంట్‌ వున్న డైరెక్టర్‌. నిర్మాత రవికిరణ్‌ మల్లెపువ్వులాంటి ప్రొడ్యూసర్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే టీమ్‌ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు'' అన్నారు.

సంగీత దర్శకుడు బుల్గానిన్‌ మాట్లాడుతూ - ''నాకు ఇష్టమైన పాటని సుకుమార్‌గారు రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ - ''ఎడిటర్‌ మోహన్‌గారి దగ్గర సుకుమార్‌గారు, నేను కలిసి వర్క్‌ చేశాం. గ్రేట్‌ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్‌. ఆయన సాంగ్స్‌, ట్రైలర్‌ చూసి చాలా మంచి సినిమా చేశావ్‌! కంగ్రాట్స్‌ అని చెప్పడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను'' అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''నేను ఇష్టపడే మంచి యూనిక్‌ వున్న డైరెక్టర్స్‌లో సుకుమార్‌గారు ఒకరు. ఈ చిత్రంలో కైలాష్‌ ఖేర్‌ పాడిన నాలుగవ పాటని సుకుమార్‌గారు రిలీజ్‌ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' అన్నారు.

నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''రామజోగయ్య శాస్త్రి రాసిన నాలుగవ పాటని కైలాష్‌ ఖేర్‌ పాడారు. ఈ పాట చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది. మంచి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌గారు మా పాట లాంచ్‌ చేయడం ఆనందంగా వుంది. ఆయనకి మా యూనిట్‌ తరపున ధన్యవాదాలు'' అన్నారు.

డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.