Vishal’s Abhimanyudu to release on January 13th as Sankranti gift

Mass Hero Vishal who scored many super hits from 'Pandem Kodi' to 'Detective' is currently enjoying the huge success of 'Detective'. He is also planning to make 'Detective-2'. Vishal's next film with Samantha as a female lead in Vishal Film Factory's Production is titled as 'Abhimanyudu'. Producer Hari Gujjalapudi is presenting this film in Telugu under his banner 'Hari Venkateswara Pictures'. Action King Arjun will be seen in a prominent role in this film. First Look of the film will be revealed on November 18th.

Speaking about the film Mass Hero Vishal, " This is a very High range film compared to my previous films. I loved this film both as a Hero and a Producer. I am confident that this film will score me a big hit this sankranthi. Director Mithran has dealt the subject very well. Film has been shot lavishly without any compromise."

Producer G.Hari says," Shooting part is completed. FIlm is currently undergoing post-production works. First Look of the film will be released on Nov 18th and a Motion Poster will be released too during the evening of the same day. Audio will be released in a grand event on December 27th. FIlm will be released as a Sankranthi gift on January 13th worldwide. This film is being made with a very high budget and high technical values in Vishal's career."

Along with Mass Hero Vishal, Samantha, Action King Arjun other principle cast involves popular actors. Music : Yuvan Shankar Raja, Cinematography : George C.Williams, Editing : Ruben, Fights : DIlip Subbarayan, Art : Umesh J.Kumar, Dialogues : Rajesh A.Murthy, Direction : P.S.Mithran

జనవరి 13న సంక్రాంతి కానుకగా మాస్‌ హీరో విశాల్‌ కొత్త చిత్రం 'అభిమన్యుడు'

పందెం కోడి నుంచి డిటెక్టివ్‌ వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌ 'డిటెక్టివ్‌' పెద్ద హిట్‌ అయిన ఆనందంలో వున్నారు. డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మాస్‌ హీరో విశాల్‌, సమంత జంటగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'అభిమన్యుడు' టైటిల్‌ని ఖరారు చేశారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత హరి గుజ్జలపూడి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌ 18న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం గురించి మాస్‌ హీరో విశాల్‌ తెలియజేస్తూ ''ఇంతకుముందు నేను చేసిన అన్ని సినిమాలకంటే హై రేంజ్‌ సినిమా ఇది. హీరోగా, నిర్మాతగా నాకు బాగా నచ్చిన సినిమా. డెఫినెట్‌గా ఈ సంక్రాంతికి నాకు మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. దర్శకుడు మిత్రన్‌ సబ్జెక్ట్‌ని చాలా బాగా డీల్‌ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది'' అన్నారు.

నిర్మాత జి.హరి మాట్లాడుతూ ''షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. నవంబర్‌ 18 ఉదయం ఈ చిత్రం ఫస్‌లుక్‌ని విడుదల చేసి, సాయంత్రం మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తాం. డిసెంబర్‌ 27న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశార. జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం. విశాల్‌ కెరీర్‌లోనే హై బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న సినిమా ఇది'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.