Nadi Award is result of our hard work: Genius Director/Producer Sudhakar Gowd

మా శ్రమకు ఫలితమే ఈ నంది పురస్కారం...
- ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్ర దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్

భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు సుధాకర్ గౌడ్. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిిలింస్ పతాకంపై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం ద్వారా బాల బాలికల్లో కులం మతం అనే బేధాలు ఉండకూడదని, కేవలం ప్రతిభ ఆధారంగానే పిల్లలు ఎదిగేలా చూడాలని దర్శకులు సందేశమిచ్చారు. అబ్దుల్ కలాం లాంటి అద్భుత శాస్త్రవేత్తలు మన చుట్టూ ఉండే పిల్లల్లోలనూ ఉండొచ్చని, వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. భావి భారత పౌరులైన చిన్నారులు చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణ, మూగ జీవాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చూపించారు. ఇలా బాల బాలికల్లో స్ఫూర్తినింపే అనేక అంశాలతో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు భీమగాని సుధాకర్ గౌడ్. నవంబర్ 4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ మధ్యాహ్నం ఆటతో పలు కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్ నూ అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా పేరు తెచ్చుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి నంది గౌరవం దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా అవార్డ్ ఇవ్వడం ద్వారా జ్యూరీ సభ్యులు తన శ్రమను గుర్తించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ...పెద్దవాళ్లతో కంటే పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే జ్యూరీ సభ్యులు ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారాన్ని అందించారు. సాధారణంగా బాలల చిత్రాలకు అవార్డ్ లు ఇస్తుంటారు. కానీ బాలల చిత్ర దర్శకుడిగా పురస్కారం దక్కడం మరింత ఆనందంగా ఉంది. జ్యూరీకి, ఫ్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. విద్యాసంస్థల అధిపతిగా, విద్యావేత్తగా చిన్నారుల పట్ల నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని భావించాను. అందుకే ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే చిత్రాన్ని రూపొందించాను. పిల్లల సినిమా అనగానే అంతా చిన్నచూపు చూస్తుంటారు. నిర్మాణ విలువలు బాగుండవు అంటారు. కానీ మేము దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో పేరున్న నటీనటులతో ఉన్నత సాంకేతిక విలువలతో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ సినిమాను తెరకెక్కించాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం అభివృద్ధి చెందాలంటే రేపటి తరంలో మరెందరో అబ్దుల్ కలాంలు రావాలి...అందుకోసం ప్రతిభ గల బాల బాలికలను వెన్నుతట్టి ప్రోత్సహించాలి అనే విషయాన్ని ప్రధానంగా చూపించాం. చిన్న చిన్న పరాజయాలకు, తప్పులకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పాం. పర్యావరణ హితాన్ని గుర్తుచేసే విషయాలున్నాయి. ఇలా బాలల్లో స్ఫూర్తి కలిగించే అనేక అంశాలను సినిమాలో రూపొందించాం. ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ రావడం దర్శకుడిగా నా బాధ్యతను పెంచింది. భవిష్యత్ లో మరిన్ని బాలల చిత్రాలు తెరకెక్కించి...వాళ్లను అలరించాలని కోరుకుంటున్నాను. అన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.