Social News XYZ     

Ganta Ravi gave an extraordinary performance in Jayadev: Director Jayanth (Interview)

Ganta Ravi gave an extraordinary performance in Jayadev: Director Jayanth (Interview)

Jayanth C.Paranji who delivered Superhits like 'Preminchukundam..Raa','Premante Idera','Baavagaaru Baagunnara','Lakshmi Narasimha' is quite popular as Talented and Decent Director. He created his own mark by blending Love, Emotions, Entertainment perfectly with Commercial elements. After a gap, Jayanth C.Paranji is Directing 'Jayadev' introducing Ganta Ravi, Son of A.P Education Minister Ganta Srinivasa Rao. Popular Producer K.Ashok Kumar is producing this film under Sri Lakshmi Venkateswara Art Creations banner. The shooting part of the film has been completed and is currently in its post-production stages. The film will complete censor and will hit the screens very soon. Here is the interview with Decent Director Jayanth C.Paranji about his 'Jayadev'

How did this project materialize?
- Cameraman Jawahar Reddy called me and asked for a meeting. I told him to meet me at home. When he rang the bell, I opened the door and saw a tall young man along with Jawahar Reddy. At the first moment, I thought that he is good looking and can be made as a Hero. When I asked about him, to my surprise Jawahar Reddy said that he is the son of Ganta Srinivasa Rao and he is very much interested in acting in films. He lost 16 kilos weight in 2,3 months and trained by Sathyanand Master in acting. He worked very hard, trained himself with utmost passion and did this film.

 

What is this film about?
- I watched Tamil Superhit film 'Sethupathy' and liked it very much. We take the main essence of the original and made necessary changes to suit our nativity. Paruchuri Brothers prepared a terrific script. This is a story of a sincere police officer.

We already have a lot of police stories. So, what is the difference between them and 'Jayadev'?
- Yes, I agree. We have many iconic police stories like 'Ankusham','Karthavyam'. All of them have a common point. They deal with personal attachment. But, this film deals with the story of a selfless police officer who always try to help others, other police officers, families as a part of his duty. We made this Film close to reality with natural treatment.

Tell us about Ganta Ravi's character?
- Ganta Ravi essayed the role of a powerful police officer as 'Jayadev'. We highlighted his plus points in this film.There are many clap, whistle-worthy scenes in this film. Ganta Ravi did great in the role of 'Jayadev'. He suited the role perfectly. He did the role of a short-tempered guy who looks moody.

About Heroine's character?
- We introduced Malavika Raj who did the child role of Kareena Kapoor in 'Kabhi Kushi Kabhi Gham'. She gave a beautiful performance in the film. Both Ganta Ravi, Malavika Raj will have a long run in the industry.

Tell us about other important characters?
- There is a surprise element in the film. After a long gap Veteran Hero, Vinod Kumar will be seen as a villain in this film. His role is full of terror and he did terrific in that role. Hats off to him for his superb performance.

You worked with many Big Stars, What is the reason to work with a new hero?
- Nowadays everyone is behind combinations rather than scripts. I always give preference to Script. With a good script you can work with anyone. We introduced Prabhas as Hero with 'Eeshwar'. Now Prabhas became a very big star. I am proud of him. I believe Ganta Ravi too will become a big star like Prabhas.

Tell us about music?
- Mani Sharma has given beautiful melody songs. This film has 5 songs. 2 of them were picturised in Slovenia and Europe. Remaining songs were shot in sets here. Out of my 12 films, I worked with Mani Sharma for 9 films. All of them became musical hits. We released 4 songs till now and all of them received a very good response.

What is the reason for this long gap after 'Teenmaar'?
- I made 'Allari Pidugu' before 'Teenmaar'. After a gap of five years, I made 'Teenmaar'. Both of them didn't work well. So, I took a break. After five years I directed 'Jayadev'. I feel this is the right film being made in the right time. I made this film with commercial elements which will be enjoyed by all sections of the audience. I will prove myself once again as a Director with this film.

About Producer Ashok Kumar's making?
- I worked as a clap assistant for Venkatesh's 'Dhruvanakshatram' Produced by Ashok Kumar. Later I Directed two films 'Premante Idera','Eeshwar' Produced by Ashok. This is the third film in our combination. We will definitely score a hattrick with 'Jayadev'

About film with Mahesh?
- Mahesh wanted to do a love story. I am in search of a good script. If everything falls in place we will make a film.

About film with Prabhas?
- I keep in touch with Prabhas regularly. He hasn't changed from his 'Eeshwar' days. We tried two, three scripts but didn't materialized due to date issues. I will definitely make a film with Prabhas.

Ganta Ravi, Malavika will be seen as Hero and Heroine. Other principle cast involves Vinod Kumar, Paruchuri Venkateswara Rao, Posani, Vennela Kishore, Hari Teja, Shravan, Supreet, Komati Jayaram, Rajeswari, Shiva Reddy, Kadambari Kiran, Bittiri Satthi, Karuna, Meena, Jyothi, Ravi Prakash, Aravind

Music : Mani Sharma, Cinematography : Jawahar Reddy, Original Story : Arun Kumar, Written By : Paruchuri Brothers, Editing : Marthand K Venkatesh, Fights : Venkat, Art : Krishna Maya, Stills : Narayana, Co-Director : Prabhakar Nag, Production Controller : P.Ram Mohan Rao, Producer : K.Ashok Kumar, Direction : Jayanth C Paranji

'జయదేవ్‌'లో గంటా రవి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు
- దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ

'ప్రేమించుకుందాం.. రా', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారు బాగున్నారా!' 'లక్ష్మీనరసింహా' వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి దర్శకత్వం వహించి డీసెంట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు జయంత్‌ సి. పరాన్జీ. లవ్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ అవకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చిత్రాలను రూపొందిస్తూ తనకంటూ సెపరేట్‌ మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్నారు ఆయన. చాలాకాలం గ్యాప్‌ తర్వాత జయంత్‌ సి. పరాన్జీ 'జయదేవ్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.పి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జయదేవ్‌'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సెన్సార్‌ పూర్తి చేసుకుని అతి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి. పరాన్జీతో 'జయదేవ్‌' చిత్ర విశేషాల గురించి జరిపిన ఇంటర్వ్యూ.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
- చాలా తమాషాగా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది. కెమెరామెన్‌ జవహార్‌రెడ్డి ఒక రోజు కాల్‌ చేసి అర్జెంట్‌గా కలవాలి అన్నాడు. ఇంటికి రమ్మన్నాను. బెల్‌ కొట్టగానే డోర్‌ నేనే ఓపెన్‌ చేశా. చూడగానే జవహార్‌ రెడ్డి, ప్రక్కన ఆరడుగుల పొడవున్న ఓ వ్యక్తి వున్నారు. అతను ఎవరు? అని అడగ్గానే గంటా శ్రీనివాసరావుగారి అబ్బాయి. తనకి సినిమాల్లో చెయ్యాలని బాగా ఇంట్రెస్ట్‌. అందుకే కలవడానికి వచ్చాం అని చెప్పాడు జవహార్‌రెడ్డి. గంటా రవిని చూడగానే చాలా అందంగా వున్నాడు. ఇతనితో సినిమా తియ్యొచ్చు అనే ఫీల్‌ కలిగింది. రెండు, మూడు నెలల్లో 16 కిలోల వెయిట్‌ తగ్గాడు. సత్యానంద్‌ మాస్టర్‌ దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్‌తో నటించాడు.

ఈ చిత్రం మెయిన్‌ కథాంశం ఏమిటి?
- తమిళ్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన 'సేతుపతి' చిత్రం చూశాను. నాకు బాగా నచ్చింది. అందులో మెయిన్‌ ఎస్సెన్స్‌ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. పరుచూరి బ్రదర్స్‌ అత్యద్భుతంగా స్క్రిప్ట్‌ని డెవలప్‌ చేశారు. ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది.

పోలీస్‌ స్టోరీస్‌ చాలా చిత్రాలు వచ్చాయి.. మరి ఈ చిత్రంలో వున్న కొత్తదనం ఏంటి?
- నిజమే. ఇంతవరకూ వచ్చిన పోలీస్‌ చిత్రాలు అన్నీ పర్సనల్‌ అటాచ్‌మెంట్‌తో వుంటాయి. 'అంకుశం', 'కర్తవ్యం'.. ఇంకా ఎన్నో చిత్రాలు అలాగే వుంటాయి. అన్నింట్లో కామన్‌ ఒకటే పాయింట్‌ వుంటుంది. అలా కాకుండా ఈ చిత్రంలో ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ తన కోసం కాకుండా డ్యూటీ కోసం ప్రక్కవారి కోసం తోటి ఆఫీసర్స్‌, వాళ్ల ఫ్యామిలీస్‌ని సేవ్‌ చేయడం కోసం కష్టపడుతున్నాడు. సెల్ఫ్‌ లెస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ స్టోరీ. రియాల్టీకి దగ్గరగా చాలా నేచురల్‌గా సినిమా వుంటుంది.

గంటా రవి క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- 'జయదేవ్‌'గా పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో గంటా రవి నటించాడు. తనలోని ప్లస్‌ పాయింట్స్‌ హైలైట్‌ చేస్తూ ఈ చిత్రంలో చూపించాం. సినిమా చూసి ఆడియన్స్‌ క్లాప్స్‌, విజిల్స్‌ కొట్టేవిధంగా సీన్స్‌ అన్ని వుంటాయి. ఈ చిత్రంలో 'జయదేవ్‌' పాత్రలో గంటా రవి అద్భుతంగా పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. 'జయదేవ్‌' క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. మూడీగా వుంటూ షార్ట్‌ టెంపర్‌తో అతని క్యారెక్టర్‌ వుంటుంది.

హీరోయిన్‌ క్యారెక్టర్‌ గురించి?
- 'కభీ ఖుషి కభీ ఘమ్‌' చిత్రంలో చిన్నప్పటి కరీనాకపూర్‌ క్యారెక్టర్‌లో నటించిన మాళవికా రాజ్‌ని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. బ్యూటిఫుల్‌గా నటించింది. గంటా రవి, మాళవిక రాజ్‌ ఇద్దరికీ ఇండస్ట్రీలో చాలా లాంగ్‌ రన్‌ వుంటుంది.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు గురించి?
- ఒక సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఈ చిత్రంలో వుంటుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్న వినోద్‌కుమార్‌ ఈ చిత్రంలో విలన్‌గా యాక్ట్‌ చేశాడు. చాలా టెర్రర్‌ పాత్ర అది. ఔట్‌ స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశారు వినోద్‌. ఒక కొత్త వినోద్‌కుమార్‌ని ఈ చిత్రం ద్వారా చూస్తారు. హ్యాట్సాఫ్‌ వినోద్‌కుమార్‌.

బిగ్‌ స్టార్స్‌తో సినిమాలు తీసిన మీరు ఒక కొత్త హీరోతో ఈ సినిమా చేయడానికి రీజన్‌?
- ఇప్పుడు ఆ సిస్టమ్‌ అంతా పోయింది. కాంబినేషన్‌కి తప్ప స్క్రిప్ట్‌కి ప్రిఫరెన్స్‌ ఇవ్వడం లేదు. నాకు మెయిన్‌ స్క్రిప్ట్‌ ముఖ్యం. అది వుంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేశాం. ఇప్పుడు ప్రభాస్‌ పెద్ద రేంజ్‌ హీరో అయ్యాడు. చాలా గర్వంగా వుంది. గంటా రవి కూడా ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడని కాన్ఫిడెన్స్‌ వుంది.

మ్యూజిక్‌ గురించి చెప్పండి?
- మణిశర్మ బ్యూటిఫుల్‌ మెలోడి సాంగ్స్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో 5 పాటలు వున్నాయి. రెండు పాటలు స్లావేనియా, యూరప్‌లలో చిత్రీకరించాం. మిగతావి ఇక్కడ సెట్స్‌ వేసి తీశాం. నేను 12 సినిమాలు చేస్తే అందులో 9 సినిమాలు మణిశర్మ మ్యూజిక్‌ చేశారు. అన్నీ మ్యూజికల్‌గా సూపర్‌హిట్స్‌ అయ్యాయి. ఇప్పటికే 4 పాటలు రిలీజ్‌ చేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

'తీన్‌మార్‌' తర్వాత ఇంత బ్రేక్‌ తీసుకోవడానికి రీజన్‌?
- 'తీన్‌మార్‌' ముందు 'అల్లరి పిడుగు' చేశాను. ఐదు సంవత్సరాలు గ్యాప్‌ తర్వాత 'తీన్‌మార్‌' చేశా. రెండూ సరిగ్గా ఆడలేదు. దాంతో బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ 5 ఇయర్స్‌ గ్యాప్‌ తర్వాత 'జయదేవ్‌' చేస్తున్నాను. ఇది కరెక్ట్‌ టైమ్‌లో తీస్తున్న రైట్‌ ఫిలిం ఇది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఒక డైరెక్టర్‌గా మళ్లీ నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే చిత్రమవుతుంది.

నిర్మాత అశోక్‌కుమార్‌గారి మేకింగ్‌ గురించి?
- వెంకటేష్‌ హీరోగా అశోక్‌కుమార్‌ నిర్మించిన 'ధృవనక్షత్రం' చిత్రానికి నేను క్లాప్‌ అసిస్టెంట్‌ని. డైరెక్టర్‌ని అయ్యాక అశోక్‌ బేనర్‌లో 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్‌' రెండు చిత్రాలు చేశాను. రెండూ సూపర్‌హిట్స్‌ అయ్యాయి. ఇది థర్డ్‌ ఫిల్మ్‌. డెఫినెట్‌గా మా కాంబినేషన్‌లో 'జయదేవ్‌' హ్యాట్రిక్‌ సాధిస్తుంది.

మహేష్‌తో సినిమా ఎప్పుడు?
- మహేష్‌ లవ్‌స్టోరీ చేద్దామన్నాడు. ఇంకా స్క్రిప్ట్‌ ఫైనల్‌ అవలేదు. అన్నీ సెట్‌ అయ్యాక ఒక మంచి చిత్రం చేస్తాను.

మరి ప్రభాస్‌తో చేసే సినిమా?
- రెగ్యులర్‌గా ప్రభాస్‌తో టచ్‌లో వుంటాను. 'ఈశ్వర్‌' టైమ్‌లో ప్రభాస్‌ ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. ఏం మారలేదు. గతంలో రెండు, మూడు కథలు విన్పించాను. డేట్స్‌ ప్రాబ్లెమ్‌ వల్ల సెట్‌ కాలేదు. తప్పకుండా ప్రభాస్‌తో కూడా ఓ సినిమా చేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు 'జయదేవ్‌'తో సూపర్‌హిట్‌ కొట్టబోతున్న డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి. పరాన్జీ.

వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

Facebook Comments
Ganta Ravi gave an extraordinary performance in Jayadev: Director Jayanth (Interview)

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: