Social News XYZ     

Srinivas Avasarala Voice Over For “Pelliki Mundu Prema Katha”

అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ తో "పెళ్ళికి ముందు ప్రేమకధ" !!

Srinivas Avasarala Voice Over For "Pelliki Mundu Prema Katha"

పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ గారి దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "పెళ్ళికిముందు ప్రేమ కధ"."రాజుగారి గది" ఫేమ్ చేతన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ చెప్పారు. నేటితరం యువత జీవితంలో చాలా కీలకమైన పెళ్లి అనే ఘట్టానికి ఇస్తున్న ప్రాముఖ్యత, ఆ కారణంగా వారి జీవితాల్లో తలెత్తుతున్న సమస్యల నేపధ్యంలో విజ్ణానానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

 

ఈ సందర్భంగా డి.ఎస్ రావు మాట్లాడుతూ.. "నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేటితరానికి మంచి మెసేజ్ తోపాటు ఎంటర్ టైన్మెంట్ ను అందించే సినిమా "పెళ్ళికి ముందు ప్రేమకథ". తాగుబోతు రమేష్, సత్య, శివ ప్రసాద్, రాకేష్ ల కాంబిణేషన్ లో తెరకెక్కిన కామెడీ సీన్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఈ నెల ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నాము, హీరో హీరొయిన్ కెమిస్ట్రీ ఈ పెళ్ళికి ముందు ప్రేమ కధ లో బాగా వర్క్అవుట్ అయ్యింది. ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తున్నాం" అన్నారు.

"రాజు గారి గది" ఫేం చేతన్ శీను, సునైన హీరోహీరొయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, అశ్విని, డా.శివ ప్రసాద్, రాకేశ్, రచ్చ రవి, గౌతమి, మాస్టర్ శివ కృష్ణ, గంగాధర్, బాష , ఆర్.పి,కీర్తి నాయుడు, శ్రీ ప్రియ, యార్లగడ్డ కిరణ్, నాగేంద్ర కుమార్ తదితరలు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఫోటోగ్రఫి : పి.సి. కన్నా, స్క్రీన్ ప్లే: సుధాకర్ పట్నం, రచన-దర్శకత్వం: మధు గోపు, నిర్మాతలు: డి.ఎస్.కె-సుధాకర్ పట్నం, అవినాష్ సాలండ్ర!

Facebook Comments
Srinivas Avasarala Voice Over For "Pelliki Mundu Prema Katha"

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: