Comedian Ali releases Devi Sri Prasad movie motion poster

`దేవిశ్రీప్ర‌సాద్` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన స్టార్ క‌మెడియ‌న్ అలీ

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ దేవిశ్రీప్ర‌సాద్‌.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను స్టార్ క‌మెడియ‌న్ అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

అలీ మాట్లాడుతూ - మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ న‌టించిన దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. టైటిల్ చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. మ‌రి ఈ టైటిల్ వెనుక క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మోష‌న్ పోస్ట‌ర్ ఇంకా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

చిత్ర నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ మాట్లాడుతూ - మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.