Movies

Nandu’s Inthalo Ennenni Vinthalo first look launched

వినాయక్ శిష్యుడు దర్శకత్వంలో నందు

Nandu's Inthalo Ennenni Vinthalo first look launched

హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు నటిస్తోన్న నూతన సినిమా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్ వరికూటి ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలానే గతంలో వరప్రసాద్ ఐ ఫోన్ అనే వినూత్నమైన షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించి పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ స్ర్కీన్ ప్లే అండ్ డైరెక్షన్ కేటగిరిల్లో అవార్డులు కైవసం చేసుకున్నారు.

 

ఈ నేపథ్యంతోనే నందు, సౌమ్యవేణుగోపాల్ హీరో హీరోయిన్లుగా ఇంతలో ఎన్నెని వింతలో అనే ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించారు. దాదాపు 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నూతన సంవత్సర కానుకగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకేనాయుడు తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వరప్రసాద్ తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవ్వరు టచ్ చేయని కొత్త కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కిందని త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతూ దర్శకుడు వరప్రసాద్ తెలుగు ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేశారు.

Facebook Comments
Share