South Cinema

Sapthagiri Express movie team is on success tour

విజయయాత్ర లో ''సప్తగిరి ఎక్స్ ప్రెస్ ''చిత్ర యూనిట్

మాస్టర్స్ హోమియో అధినేత డాక్టర్ రవి కిరణ్ సాయి సెల్యూలాయిడ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర యూనిట్తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర నిర్వహిస్తోంది. ఈ టూర్ లో భాగంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ వెళ్లిన ప్రతి చోట వారికి ఫ్యాన్స్ నీరాజనాం పడుతున్నారు. ఇక రిలీజైన ప్రతి సెంటర్ లో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయని, ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమా డాక్టర్ రవికిరణ్. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు. ఇక ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల. .

Facebook Comments

About Raju Sagi

 

Share