Hero Nikhil’s ‘Kesava’ movie first look released

నిఖిల్‌ ‘కేశవ’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘స్వామి రారా’ సినిమా. ఇప్పుడీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘కేశవ’. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ–లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. నేడు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ‘‘Revenge is a Dish Best Served Cold - The Godfather Kill Bill & Many More’ ఈ ఒక్క క్యాప్షన్‌ చాలు సినిమా ఎంత కొత్తగా ఉండబోతుందో చెప్పడానికి. క్యాప్షన్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు మాత్రమే కాదు. సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది. ‘స్వామి రారా’ తరహాలో ఈ ‘కేశవ’ కూడా టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌తో 80 శాతం సినిమా పూర్తయింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరుగుతోంది. జనవరి 2 నుండి 10 వరకూ నరసాపురంలో జరిగే షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు.

దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. షూటింగ్‌ అంతా హైదరాబాద్, కోస్తా పరిసర ప్రాంతాల్లో చేస్తున్నాం. నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌ క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగా ఉంటాయి. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.

రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌., సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ, నిర్మాత: అభిషేక్‌ నామా, సమర్పణ: దేవాన్ష్‌ నామా.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%