Writer Vissu congratulates Telangana state chief secretary Pradeep Chandra

తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్ చంద్ర‌ను అభినందించిన సినీ ర‌చ‌యిత విస్సు...

జీనియ‌స్‌, రామ్‌లీల‌, సిద్ధార్థ్ వంటి సినిమాకు క‌థ‌ల‌ను అందించిన ర‌చ‌యిత విస్సు తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్ చంద్ర ఐ.ఎ.య‌స్‌ను ఆయ‌న కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా క‌లిసి ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. విస్సు సినిమా ర‌చ‌యితే కాదు, కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ డైరెక్ట‌ర్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

గ‌త 20 సంవ‌త్స‌రాలుగా ప్ర‌దీప్ చంద్ర కుటుంబ స‌భ్యుల‌తో ఎంతో స‌న్నిహితంగా, వారి కుటుంబంలో ఒక‌డిగా మెలుగుతున్నాను. ప్ర‌దీప్ చంద్ర‌గారు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఎంతో గ‌ర్వంగా, ఆనంద‌గా ఉంది. ఈ సంద్భంలో ఆయ‌న్ను క‌లిసి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాన‌ని విస్సు తెలిపారు. ప్ర‌దీప్ చంద్ర సోద‌రి శ్రీమ‌తి ర‌త్న‌ప్ర‌భ‌గారు కూడా క‌ర్ణాట‌క ఆడిష‌న‌ల్ సి.ఎస్‌గా బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా విస్తు తెలియ‌జేశారు

Facebook Comments
Share

This website uses cookies.