Natural Star Nani releases Pittagoda movie first look

నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేసిన 'పిట్టగోడ' ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై

దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని 25 నవంబర్‌ సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు.

ఉయ్యాలా జంపాలా చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన విరించి మజ్నుతో మరో సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించారు. అష్టాచమ్మాతో పరిచయమైన అవసరాల శ్రీనివాస్‌ ఆ తర్వాత హీరోగా సక్సెస్‌ అవ్వడమే కాకుండా దర్శకుడుగా కూడా హిట్‌ సినిమాలను అందించారు. నాని, రాజ్‌తరుణ్‌లను హీరోలుగా పరిచయం చేసిన రామ్మోహన్‌ పి... డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై విశ్వదేవ్‌ రాచకొండను హీరోగా, అనుదీప్‌ కె.వి.ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%