South Cinema

Chandramohan and Kavitha grabs Television awards

చంద్ర‌మోహ‌న్‌, క‌విత‌ల‌కు బుల్లితెర పుర‌స్కారాలు

Chandramohan and Kavitha grabs Television awards

అల‌నాటి మేటి క‌థానాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్, నాటి మేటి హీరోయిన్‌, న‌టి క‌విత బుల్లితెర‌పై ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డులు అందుకున్నారు. విబి (విష్ణు బొప్ప‌న‌) ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ -2016  పుర‌స్కారాల్లో లెజెండ‌రీ అవార్డును చంద్ర‌మోహ‌న్‌, జీవ‌న సాఫ‌ల్య పుర‌స్కారాన్ని న‌టి శ్రీ‌మ‌తి క‌వితల‌కు ప్ర‌క‌టించారు. ప్ర‌భాక‌ర్  ఆల్‌రౌండ‌ర్ పుర‌స్కారాన్ని అందుకోనున్నారు. ఈ పుర‌స్కారాల్ని డిసెంబ‌ర్ 4న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగే ఓ ప్ర‌యివేటు కార్య‌క్ర‌మంలో అందించ‌నున్నామ‌ని అవార్డు క‌ర్త‌లు విష్ణు బొప్ప‌న తెలియ‌జేశారు. వెండితెర, బుల్లితెర న‌టీన‌టులు, ప్ర‌ముఖులు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పేద క‌ళాకారుల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు.

 

బుల్లితెర‌పై వివిధ రంగాల్లో ప్ర‌తిభ చూపిస్తున్న న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ పుర‌స్కారాల్ని అందిస్తూ గ‌తేడాది విబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ పుర‌స్కారాల్ని ప్రారంభించింది. 2015లో సీనియ‌ర్ న‌టులు రంగ‌నాథ్‌, రాళ్ల‌ప‌ళ్లి వంటి ప్ర‌ముఖుల‌కు పుర‌స్కారాల్ని అందించింది.

Facebook Comments
Share