South Cinema

Karam Dosa to release in December

డిసెంబ‌ర్‌లో త్రివిక్రమ్ `కారందోశ`

Karam Dosa to release in December

ఏదో పెద్దగా చేసెయ్యాలి. ఇర‌గ‌దీసెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి..అని క‌ల‌లు కంటూ క్లారిటీ మిస్స‌వుతోంది నేటి యువ‌త‌రం. మాట‌లు త‌గ్గించి చేత‌లు చూపించండి గురూ... ఒళ్లొంచి ప‌నిచెయ్యండి. సెల్ఫ్‌కి, స‌మాజానికి ప‌నికొస్తారని చెబుతున్నామ‌న్నారు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌.జి. శివ రామచంద్రవరపు, సూర్య శ్రీ‌నివాస్‌, చంద‌న నాయ‌కానాయిక‌లుగా వీణావేదిక ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై త్రివిక్ర‌మ్‌.జి తెర‌కెక్కించిన‌ సినిమా -కారందోశ‌. డిసెంబ‌ర్‌లో రిలీజ్ సంద‌ర్భంగా..

 

ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ -చాలా సరదాగా సాగిపొయ్యే అర్థవంతమయిన కథతో ఈ సినిమాని తెర‌కెక్కించాం.ఇటివలే రిలీజ్ చేసిన ఆడియో, టీజర్ కి మంచి స్పందన వస్తోంది.పోస్ట్ ప్రొడక్షన్ , సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు. వంకాయలసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్ ఇత‌ర‌ ప్రధాన పాత్రలలో న‌టించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : సురేష్, కెమెరా : రాజభట్టాచార్య‌, సంగీతం : సిద్దార్థ్ వాట్కిన్స్, సాహిత్యం : శ్రీరామ్ , నేపద్య సంగీతం : దేవ్ గురు

Facebook Comments
Share