Maha Rudrabhishekam in 1116 Shiva Temples for Gautamiputra Satakarni

1116 శివాలయాల్లో గౌత‌మీపుత్రుడి కోసం మ‌హారుద్రాభిషేకం...

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌ధారిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌స్ట్‌ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి.బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి.  వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు జాతి గొప్ప‌తనాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాతకర్ణి నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం నంద‌మూరి అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నంద‌మూరి అభిమానులు సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆశిస్తూ న‌వంబ‌ర్ 28 కార్తీక సోమ‌వారం రోజున దేశ‌వ్యాప్తంగా ఉన్న 1116 శివాల‌యాల్లో ఏక‌కాలంలో మ‌హారుద్రాభిషేకంను నిర్వ‌హిస్తున్నారు.

ఎన్‌.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వ‌ర్యంలో మ‌హారుద్రాభిషేకం జ‌ర‌గ‌నుంది. ఈ రుద్రాభిషేకంలో ఏదేని ఓ ఆల‌యంలో జరిగే రుద్రాభిషేకంలో నంద‌మూరి బాల‌కృష్ణ పాల్గొంటున్నారు. దేశంలో ఏ హీరోకు నిర్వ‌హించ‌ని విధంగా నంద‌మూరి బాల‌కృష్ణ కోసం ఆయ‌న న‌టించిన 100వ చిత్రంగౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం ఆయ‌న అభిమానులు వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Facebook Comments
Share

This website uses cookies.