“Satya Gang” opening on November 24th in Annapurna Studios

అన్నపూర్ణ స్టూడియోస్‌ను
అడ్డాగా చేసుకుంటున్న 'సత్య గ్యాంగ్'

పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన యువ ప్రతిభాశాలి ప్రభాస్‌ నిమ్మలను దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సత్య గ్యాంగ్‌’. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై యం.మహేష్‌ కన్నా-ఎస్‌.మంగారావు, చలపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 24న (గురువారం) అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.

ప్రత్యూష్‌ వి.ఆర్‌., హర్షిత పన్వార్‌, కిషన్‌ కన్నయ్య కె.కె., సాత్విక్‌, సిరి కొమ్ము, వినోద్‌ కుమార్‌, జీవా, సమీర్‌, జెన్ని, బి.హెచ్‌.ఇ.ఎల్‌. ప్రసాద్‌, విజయ్‌, చిట్టిబాబు, జబదర్దస్త్‌ అప్పారావు, గబ్బర్‌సింగ్‌ రాజశేఖర్‌, అంజిబాబు, ప్రేమ్‌, మహేష్‌ కన్నా ముఖ్యపాత్రలు పోషిస్తున్న "సత్య గ్యాంగ్" చిత్ర ప్రారంభోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని, యూనిట్‌ సభ్యులకు శుభాశీస్సులు అందజేయనున్నారు.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి ఆర్ట్: డేవిడ్, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్, కో-డైరెక్టర్: కొండలరావు, నిర్మాతలు: ఎం.మహేష్ కన్నా-ఎస్.మంగారావు-చలపతి, కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల !!

Facebook Comments
Share

This website uses cookies.