Social News XYZ     

Vijay Sethupathi’s Dr. Dharma Raju in post-production

నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల్లో విజ‌య్ సేతుప‌తి `డా.ధ‌ర్మ‌రాజు ఎం.బి.బి.ఎస్‌`

Vijay Sethupathi's Dr. Dharma Raju in post-productionడిఫరెంట్ మూవీస్‌తో తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విజయ్ సేతుపతి కథానాయకుడుగా శీను రామ‌సామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  ధర్మదొరై చిత్రం ..తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో
సుధా సినిమాస్‌ బ్యాన‌ర్‌పై జె.సాంబ‌శివ‌రావు నిర్మాత‌గా డా.ధ‌ర్మ‌రాజు ఎం.బి.బి.ఎస్‌. పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

ప‌విత్ర‌మైన డాక్ట‌రు వృత్తిలోని ఓ యువ‌కుడు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఆ స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాడు అనేదే సినిమా క‌థ‌. స్టార్ హీరోయిన్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సాధించిన ఈ సినిమాలో విజ‌య్ సేతుపతి త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి రాధిక న‌టించ‌డం విశేషం.

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడు. బిచ్చ‌గాడు వంటి సెన్సేష‌న్ చిత్రానికి మాట‌లు పాటలు అందించిన భాష్య‌శ్రీ ఈ చిత్రానికి మాట‌లు, పాట‌లు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత జె.సాంబ‌శివ‌రావు తెలియ‌జేశారు.

 

విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా, రాధిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, సృష్టి డాంగే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః యువ‌న్‌శంక‌ర్ రాజా, సినిమాటోగ్ర‌ఫీః ఎం.సుకుమార్‌, ఎడిటింగ్ః కాశీవిశ్వ‌నాథ్‌, నిర్మాతః జె.సాంబ‌శివ‌రావు, ద‌ర్శ‌క‌త్వంః శీను రామ‌సామి.

 

 

Facebook Comments

%d bloggers like this: