South Cinema

Poonam Pandey Movie 1st Schedule Completed

పూనమ్‌ పాండే మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి

Poonam Pandey Movie 1st Schedule Completed

వి.బి.ఆర్‌. క్రియేషన్స్‌, సూరజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ఫకృద్దీన్‌ ఖాన్‌, విజయ్‌భాస్కర్‌ రెడ్డి నిర్మాతలుగా, భవాని మస్తాన్‌ దర్శకత్వంలో సెన్సేషనల్‌ భామ పూనమ్‌ పాండే ప్రధాన పాత్రలో, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుని రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా..నిర్మాతలు మాట్లాడుతూ..భవాని మస్తాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్‌ తార పూనమ్‌ పాండే ప్రత్యేక ఆకర్షణ కానుంది. అలాగే ఒక ప్రత్యేక పాత్రలో టాలీవుడ్‌ ప్రముఖ హీరో సంపూర్ణేష్‌ బాబు నటించనున్నారు. పూనమ్‌ పాండే, ఆశిష్‌ విద్యార్ధి మొదలగువారు ఫస్ట్‌ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ మంత్‌ ఎండింగ్‌ నుండి ముంబాయ్‌లో రెండో షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నాము. మా ఈ తొలి ప్రయత్నం సక్సెస్‌ అవుతుందని, ఈ మూవీ మంచి హిట్‌ అయ్యి..మా బ్యానర్‌లకి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము..అని అన్నారు.

 

పూనమ్‌పాండే, ఆశిష్‌ విద్యార్ధి, తాగుబోతు రమేష్‌, జబర్ధస్త్‌ నటులు మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనెం వెంకటరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: రామకృష్ణ రాజు, నిర్మాతలు: ఫకృద్దీన్‌ ఖాన్‌, విజయ్‌ భాస్కర్‌ రెడ్డి పామూరు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భవాని మస్తాన్‌.

Facebook Comments
Share