South Cinema

Nandamuri Balakrishna’s movies to enter Limca Book of Records

నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్

Nandamuri Balakrishna's movies to enter Limca Book of Records

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం 900 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్ లో రేపటి నుండి( అక్టోబర్ 5) జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రే హీరో సినిమాల‌కు లేని విధంగా బాల‌కృష్ణ అభిమానులు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి ఇలా స్వాగ‌తం ప‌లక‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఈ అరుదైన విషయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోనుంది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ న‌టించిన 100 సినిమా కోసం ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

Facebook Comments

About Raju Sagi

 

Share