Movies

Sharwanand releases first look of Uttej’s daughter Chetana from Pichiga Nachave

శర్వానంద్ చే ఉత్తేజ్ డాటర్ చేతన ఫస్ట్ లుక్ రిలీజ్

Sharwanand releases first look of Uttej's daughter Chetana from Pichiga Nachave

'కుక్కకావాలి ' అంటూ 'చిత్రం' సినిమాలో , 'నీ పేరేంటి' అంటూ 'బద్రి' సినిమాలో పవన్ కళ్యాణ్ ను క్వశ్చన్ చేసిన చైల్డ్ ఆర్టిస్ మరియు కామెడీ ఆర్టిస్ ఉత్తేజ్ కూతురయిన చేతన హీరోయిన్ గా వస్తున్న ఫస్ట్ మువీ 'పిచ్చిగా నచ్చావ్'. శ్రీవత్స క్రియేషన్స్ బ్యానరుపై వస్తున్న సినిమాను కమల్ కుమార్ పెండెం , శశిభూషణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. సినిమాలో చేతన ఫస్ట్ లుక్ ను హీరో శర్వానంద్ ఫిలిం సిటీలో రిలీజ్ చేశారు. పోస్టర్ డిజైన్ బాగుందంటూ , చైల్డ్ ఆర్టిస్ట్ గా చేతన చేసిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో, హీరోయిన్ గా చేస్తున్న 'పిచ్చిగా నచ్చావ్ ' సినిమా అంతకంటే బిగ్ హిట్ అవ్వాలని చేతనకు మరియు ఎంటైర్ యూనిట్ కు శర్వానంద్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. చేతన మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్ గా రామోజీరావు గారి 'చిత్రం' సినిమాలో పరిచయమైన తను, హీరోయిన్ గా చేస్తున్న ఫస్ట్ సినిమా 'పిచ్చిగా నచ్చావ్' లోని తన ఫస్ట్ లుక్ రామోజీ రావు గారి ఫిలిం సిటీలో రిలీజ్ అవ్వడం మంచి సెంటిమెంట్ అంటూ , తన లుక్ రిలీజ్ చేసిన శర్వానంద్ కు థ్యాంక్స్ చెప్పింది. నిర్మాత మాట్లాడుతూ అడగ్గానే చేతన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు శర్వానంద్ కు ఎంటైర్ యూనిట్ తరుపున థ్యాంక్స్ చెపుతూ , హీరో నాని రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్ కు , మంచు లక్ష్మీ రిలీజ్ చేసిన హీరో ఫస్ట్ లుక్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో చేతన ఫస్ట్ లుక్ కు అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు . సినిమా టైటిల్ ఈజ్ తో ఎంత క్యాచీగా వుందో అలానే సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయని , డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను ఖచ్చితంగా రీచ్ అవ్వుద్దని డైరెక్టరు శశిభూషణ్ చెప్పారు . పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్ పుచ్ఛా రామకృష్ణ , కెమెరా వెంకటాహనుమ ,మ్యుజిక్ రాం నారాయణ్ .>

Facebook Comments

About Raju Sagi

 

Share