Bichagadu enters 25 crores club

25 కోట్ల `బిచ్చ‌గాడు`

Bichagadu enters 25 crores club

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం 63 రోజుల‌ను పూర్తి చేసుకుని దిగ్విజ‌యంగా వంద‌రోజుల వేడుక‌ను జ‌రుపుకునే దిశ‌గా వెళుతుంది. ఆంద్రాలో 10,87,33,270/-, నైజాంలో 7,35,19,804/-, సీడెడ్ లో 6,85,67,673/  రూపాయ‌ల‌తో మొత్తంగా ఇప్ప‌టికీ ఈ చిత్రం 25 కోట్ల రూపాయల‌ను క‌లెక్ట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంకా సినిమా 70 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అవుతుంద‌ని ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఇలాగే కొన‌సాగితే 30-35 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సినిమా సాధిస్తుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Facebook Comments

About Raju Sagi

 

Share