Producer K K Radha Mohan’s next Projects with Nithin & Naveen Chandra

నవీన్‌చంద్ర హీరోగా సత్తిబాబు దర్శకత్వంలో రాధామోహన్‌ కొత్త చిత్రం!

Hero Nithin Photos from A Aa Movie
Producer KK Radha Mohan @ Bengal Tiger Movie Opening Stills

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రంలో నవీన్‌చంద్ర హీరోగా చేస్తున్నాడు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పించే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూలై 18 నుండి నాన్‌స్టాప్‌గా జరుగుతుంది.

ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ - ''ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని ఆశించే సినిమా ఇది. అన్ని క్యారెక్టర్స్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి. మా బ్యానర్‌లో నిర్మిస్తున్న పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిలిం ఇది. సత్తిబాబు ఈ సబ్జెక్ట్‌ని బాగా హ్యాండిల్‌ చేస్తారన్న నమ్మకంతో ఆయన దర్శకత్వంలో తీస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ - ''ప్రేక్షకులకు నచ్చిన పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ కథలో ఉంది. హీరో నవీన్‌చంద్ర సరసన నటించే నాయికను ఎంపిక చేస్తున్నాం. దాదాపు 20 మెయిన్‌ క్యారెక్టర్స్‌తో ఈ సినిమా అందర్నీ హాయిగా నవ్విస్తుంది. దర్శకుడుగా నాకు ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. రాధామోహన్‌గారి బ్యానర్‌లో మంచి సినిమా చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

 

నవీన్‌చంద్ర, పృధ్వీ, పోసాని, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, సలోనితో పాటు ఇంకా చాలా మంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషించే ఈ వినోదాత్మక చిత్రానికి
సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌
నిర్మాత: కె.కె. రాధామోహన్‌
దర్శకత్వం: ఇ.సత్తిబాబు
డిసెంబర్‌ నుండి నితిన్‌ హీరోగా చిత్రం

నిర్మాత కె.కె. రాధామోహన్‌ తన తరువాతి చిత్రం గురించి చెబుతూ - ''రీసెంట్‌గా 'అఆ'తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన యూత్‌స్టార్‌ నితిన్‌తో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ భారీ చిత్రం ప్లాన్‌ చేస్తున్నాం. డిసెంబర్‌లో ఈ చిత్రం స్టార్ట్‌ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఎనౌన్స్‌ చేస్తాను'' అన్నారు.

Facebook Comments
Share