Minugurulu director Ayodhya Kumar Krishnamsetty’s next titled Sri Lakshmi & 24 Kisses

'మిణుగురులు' ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ కొత్త చిత్రం 'శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌'

Minugurulu director Ayodhya Kumar Krishnamsetty's next titled Sri Lakshmi & 24 Kisses

'మిణుగురులు' వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో కొత్త చిత్రం 'శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌' ప్రారంభం కానుంది. ఇది ఒక మంచి యూనిక్ ల‌వ్‌స్టోరీ, ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైనర్‌. ఓ ప్ర‌ముఖ నిర్మాన సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో ఓ ప్ర‌ముఖ హీరో, హీరోయిన్ న‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అయోధ్య‌కుమార్ మాట్లాడుతూ '''శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌' అనే టైటిల్ కొంచెం హార్డ్‌గా ఉండొచ్చు లేదా ఆస‌క్తిగానూ ఉండ‌వ‌చ్చు కానీ ఇది ప్యూర్ ల‌వ్ స్టోరీ. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఇటువంటి ఎంట‌ర్‌టైన్మెంట్ రాలేదు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించ‌నుంది. ప్రముఖ హీరో హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అలాగే సాంకేతిక వ‌ర్గం ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మిగిలిన టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. సినిమా చిత్రీక‌ర‌ణ జూలై మొద‌టి లేదా రెండో వారంలో స్టార్ట‌వుతుంది'' అన్నారు.

జూన్ 22న ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

 

Facebook Comments
Share