21st Century Love Completes Censor

సెన్సార్ పూర్తి చేసుకున్న `21ఫ‌స్ట్ సెంచ‌రీ ల‌వ్‌`

21st Century Love Completes Censor

బి.ఆర్‌.య‌స్‌.ఐ మూవీస్ బ్యాన‌ర్‌లో పోల్కంప‌ల్లి న‌రేంద‌ర్ నిర్మాత‌గా గోపినాథ్ దర్శ‌క‌త్వంలో గోపినాథ్‌, విష్ణుప్రియ జంట‌గా పృథ్వీ, వేణు, సుమ‌న్ శెట్టి, చిత్రం శ్రీను, సూర్య‌, జూనియ‌ర్ రేలంగి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన చిత్రం 21ఫ‌స్ట్ సెంచ‌రీ ల‌వ్‌. ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. విద్యార్థ‌లు, త‌ల్లిదండ్రుల‌కు క‌నెక్ట్ అయ్యే చిత్ర‌మిద‌ని సెన్సార్ స‌భ్యులు యూనిట్ స‌భ్యుల‌ను అభినందించారు.

గుంటూరు టాకీస్ సినిమాతో ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యాన‌ర్ ఆర్‌.కె.స్టూడియోస్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతున్నందున ఈ సినిమాపై మంచి అంచనాలు నెల‌కొని ఉన్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది.

 

Facebook Comments
Share