Action entertainer ‘Trayam’ ready for censor

యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా "త్రయం"..

Action entertainer 'Trayam' ready for censor

విషు రెడ్డి, అభిరామ్, సంజన , అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతొన్న చిత్రం "త్రయం". డా.గౌతమ్ నాయుడు దర్శకత్వంలో పద్మజా నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. యువతరం మెచ్చె అంశాలతో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా త్రయం ను దర్శకుడు రూపొందించటం జరిగింది. ముగ్గురు వ్యక్తుల శక్తియుక్తల నేపధ్యంలో రియలిస్టిక్ గా , ముఖ్యంగా ఏలాంటి రోప్స్, డూప్స్ లేకుండా తీసిన పోరాట సన్నివేశాలు త్రయం లో హైలెట్ గా నిలవనున్నాయి.

ఈ క్రమంలో  లీడ్ రోల్స్ లో నటించిన వారికి ఎన్నో  గాయాలు అయినా కూడా ఆడియెన్స్ కు ఓ సరికొత్త థ్రిల్ ను అందించెందుకు వాటన్నింటిని తట్టుకొని  చిత్రీకరణను పూర్తి చేశారు. ఇప్పటివరకు హాలీవుడ్ లో జాకీచాన్ చెసె రియల్ ఫైట్స్ ను ఎప్పుడొ చూసిన మనకు ఇప్పుడు ఆషామాషీ గా తీసిన  తీసిన చిత్రాలు అంతగా నచ్చటం లేదు. పైగా తెలుగులో ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. వీటన్నింటిని దృష్టిలో  పెట్టుకుని త్రయం  ను తీశారని చిత్ర యూనిట్ చెబుతున్నారు.ప్రస్తుతం  సెన్సార్ కు సిద్దమయిన త్రయం ను అతి త్వరలొనె రిలీజ్ చెసెందుకు సన్నాహాలు చెస్తున్నారు..

 

Facebook Comments
Share