Rajamouli spellbound by Gautamiputra Satakarni’s first look

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ కు స్పెల్ బౌండ్ అయిన రాజమౌళి....

Rajamouli spellbound by Gautamiputra Satakarni's first look

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణిపై బాలకృష్ణ 100వ సినిమా అనౌన్స్ చేయగానే అంచనాలు పెరిగాయి. అందరి అంచనాలకు తగ్గకుండా దర్శకుడు క్రిష్, బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను జూన్ 10న విడుదల చేశారు. ఈ లుక్ కు అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వ్యక్తుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గౌతమిపుత్ర శాతకర్ణి లుక్ టెరిఫిక్ గా ఉంది అంటూ తన ట్విట్టర్ ద్వారా తన రెస్పాన్స్ తెలియజేశారు. ఇటీవల మొరాకాలో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది.

 

Facebook Comments
Share