LB Sriram turns Producer

నిర్మాతగా మారిన 'ఎల్.బి'.శ్రీరామ్...

ప్రముఖ రచయిత, నటుడు ఎల్.బి.శ్రీరామ్ నిర్మాతగా మారనున్నాడా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. నాటక, సినీ రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బి త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మరింతగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. 'అరవై ఏళ్లలో' కూడా 'ఇరవై ఏళ్ల' ఉత్సాహంతో ఉన్న శ్రీరామ్ ఆ రెండు తరాల మధ్య వారధిగా అనేకనేక మానవతా విలువల్ని స్వచ్ఛందంగా ఆవిష్కరించేందుకే నిర్మాతగా మారినట్లు సమాచారం. అందులో భాగంగా తన పేరులో ఉన్న మొదటి రెండు అక్షరాల కలయికతో 'లైఫ్ ఈజ్ బ్యూటీపుల్' బ్యానర్ పై లఘు చిత్రాల్ని రూపొందించి యూట్యూబ్ లో రిలీజ్ చేసే ఆలోచలనలో శ్రీరామ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ బ్యానర్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఎల్.బి శ్రీరామ్. నాలుగున్నర నిమషాల నిడివి ఉన్న ఆ టీజర్ లో ఎల్.బి తాను తెరకెక్కించబోయే లఘు చిత్రాల గురించిన విశేషాల్ని తనదైన శైతిలో వివరించారు. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రం యూట్యూబ్ లో సందడి చేస్తోంది. మరి ఇప్పటివరకు తన మాటలతో ఆ తరువాత హాస్యంతో  అలరించిన ఎల్.బి ఇప్పుడు లఘు చిత్రాలతో ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తారో చూడాలి...

";

Facebook Comments
Share

This website uses cookies.