Kedi Billa kiladi Ranga Releasing on 13th May

ఆడియో విడుదల సన్నాహాల్లో "కేడి బిల్లా-కిలాడి రంగా"

"పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొంది.. ఘన విజయం సాధించిన తమిళ చిత్రం "కేడి బిల్లా-కిలాడి రంగా" అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. రాజ్‌ కందుకూరి సమర్పణలో.. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రెజీనా ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ కాగా.. కోలీవుడ్‌లో లీడింగ్‌ హీరోయిన్‌గా పేరు గడించిన మన తెలుగమ్మాయి బిందుమాధవి మరో హీరోయిన్‌. విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్‌ శంకర్‌రాజా స్వర సారధ్యం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పాటలు ఈ వారంలో విడుదల చేసి, మే 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "రాజ్‌ కందుకూరి సమర్పణలో "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెజీనా, బిందుమాధవిల గ్లామర్‌- విమల్‌, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్- యువన్‌ శంకర్‌రాజా సంగీతం "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ "కేడి బిల్లా-కిలాడీ రంగా" చిత్రాన్నిహిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. ఈ వారంలో ఆడియో రిలీజ్‌ చేసి, మే 13న సినిమాను విడుదల చేయనున్నాం" అన్నారు.

 

ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, ఆడియోగ్రఫి: శేషు కె.యం.ఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: డా.శివ. వై. ప్రసాద్-బి.సత్యనారాయణ, మ్యూజిక్‌: యువన్‌ శంకర్‌రాజా, సమర్పణ: రాజ్‌ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Kedi Billa Kiladi Ranga Stills
Facebook Comments
Share