Categories: MoviesSouth Cinema

Mahesh And Puri Jagannath Movie ‘JANAGANA MANA’

పోకిరి' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా

సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల కొత్త చిత్రం 'జనగణమన' ఎనౌన్స్‌మెంట్‌

 

సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పోకిరి'. ఈ చిత్రం విడుదలై ఈరోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌ దాటిన తొలి సినిమా 'పోకిరి'. సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకుంది.

 

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్‌' చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. 'పోకిరి' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సినిమా 'జనగణమన' టైటిల్‌ని పూరి జగన్నాథ్‌ ఎనౌన్స్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Facebook Comments
Share