Action Thriller ‘RAHADARI ‘ on April 29th

ఈనెల 29న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ రహదారి

సేతు, అభిషేక్, రాజ్, పూజ, ఉమాశంకర్, శ్వేత, విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారిస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సురేష్ కుమార్ మరియు రాజ్ డైరెక్టర్స్.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ రాజ్ అద్భుతమైన సంగీతమందించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా ఈ చిత్రాన్ని మలిచారు. అనిల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బుర పరుస్తాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.  కిషోర్ మణి అద్భుతమైన విజువల్స్ తో కథకు రిచ్ నెస్ తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.... యాక్షన్ థ్రిల్లర్ తరహా కథలకు మన దగ్గర డిమాండ్ ఎక్కువ. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాల్ని ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా రహదారి పేరుతో మేం రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాహుల్ రాజ్ అద్భుతమైన పాటలందించారు. ప్రతీ పాటకు చిత్రంలో ఇంపార్టెన్స్ ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచారు. అనిల్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు.

డిఓపి - కిషోర్ మణి
మ్యూజిక్ - రాహుల్ రాజ్
ఎడిటర్ - విటి విజయన్
యాక్షన్ - అనిల్ అరసు
నిర్మాత - రాజ్ జకారిస్
డైరెక్టర్స్ - సురేష్ కుమార్ మరియు రాజ్

Rahadari Movie Stillsmore
Rahadari Movie Stillsmore
Rahadari Movie Stillsmore
Rahadari Movie Stillsmore
Rahadari Movie Stillsmore
Rahadari Movie Stillsmore
Rahadari Movie Stillsmore
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%